Yuvagalam: మంత్రాలయంలో లోకేష్‌ పాదయాత్ర

Yuvagalam: మంత్రాలయంలో లోకేష్‌ పాదయాత్ర
నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 81 రోజు చేరుకుంది

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 81 రోజు చేరుకుంది. ఇప్పటి వరకు వెయ్యి 30 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర కొనసాగనుంది. యువనేతకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అడుగడుగునా లోకేష్ స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్రంలో లోకేష్‌ వెంట వేలాది మంది ప్రజలు నడుస్తున్నారు. వైసీపీ పాలనతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న లోకేష్‌... వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అందరిని ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక కోసిగి శివారు క్యాంప్‌ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. 9గంటలకు డి.బెళగళ్ పంచాయితీ దొడ్డిలో స్థానికులతో సమావేశం కానున్నారు. 9.25 నిమిషాలకు డి.బెళగల్ లో విఆర్ఓలతో సమావేశం అవుతారు. 9.50 నిమిషాలకు పల్లెపాడు క్రాస్ వద్ద స్థానికులతో భేటీ అయి వారి సమస్‌యలు అడిగి తెలుసుకుంటారు. 11గంటలకు గురురాఘవేంద్ర ప్రాజెక్టు క్రాస్ వద్ద మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం లచ్చుమర్రి క్రాస్ సమీపంలో స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి ఒంటి గంటకు లచ్చుమర్రి క్రాస్ సమీపంలో భోజన విరామం తీసుకుంటారు. ఇక సాయంత్రం 4గంటలకు లచ్చుమర్రి క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. 5గంటలకు లచ్చుమర్రిలో ఈ-సేవ ఉద్యోగులతో లోకేష్‌ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం పాదయాత్రగా మాధవరం శివారు విడిది కేంద్రానికి చేరుకుంటారు. అక్కడిలో 81వ రోజు పాదయాత్ర ముగుస్తోంది. రాత్రికి లోకేష్‌ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story