Yuvagalam: 31వ రోజుకు చేరుకున్న యువగళం

Yuvagalam: 31వ రోజుకు చేరుకున్న యువగళం
గాదంకి టోల్‌గేట్‌ విడిది కేంద్రం నుండి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేషజనవాహిని మధ్య కొనసాగుతుం ది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్.. స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు, వారికి భరోసా కల్పిస్తున్నారు. లోకేష్‌ వెనుక పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అడుగులోఅడుగు వేస్తున్నారు. ప్రతీ గ్రామంలో మహిళలలు లోకేష్‌కు మంగళహారతులు పడుతున్నారు.

ఇవాళ 31వ రోజు గాదంకి టోల్‌గేట్‌ విడిది కేంద్రం నుండి లోకేష్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. ఉదయం 9గంటల 30నిమిషాలకు గాదంకిలో కాపు సామాజికవర్గ నేతలతో సమావేశమవుతారు. 10.20కి నేండ్రగుంట వద్ద పాదయాత్ర 400కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరిస్తారు. 10గంటల 30నిమిషాలకు నేండ్రగుంట గ్రామస్తులతో భేటీ అవుతారు. అనంతరం 11గంటల 55నిమి షాలకు ఇరంగారిపల్లిలో యువతీ, యువకులతో ముఖాముఖిలో పాల్గొంటారు లోకేష్. విరామం తర్వాత మధ్యాహ్నం 3గంటల 5నిమిషాలకు పాకాల గ్రామంలోని టైలర్స్‌తో మమేకమవుతారు. సాయంత్రం 4గంటల 20నిమిషాలకు పాకాలలోని స్థానిక వ్యాపారులతో ముచ్చటించనున్నారు. 4గంటల 35నిమిషా లకు పాకాల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం 5గంటల 50నిమిషాలకు గుమ్మడివారి ఇండ్ల వద్ద 31వ రోజు పాదయాత్ర ముగియనుండగా.. రాత్రి అక్కడే బస చేస్తారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story