Yuvagalam: 37వ రోజుకు చేరిన లోకేష్‌ పాదయాత్ర

Yuvagalam: 37వ రోజుకు చేరిన లోకేష్‌ పాదయాత్ర
472.7 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి, పీలేరు, కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రంలో మైనారిటీలతో లోకేష్‌ ముఖాముఖి

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 37వ రోజుకు చేరుకుంది. లోకేష్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. యువనేత ఎక్కడికి వెళ్లిన ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటూ లోకేష్‌కు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అందరి సమస్యలు వింటూ.. వారికి భరోసా కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు 472.7 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది.

నేడు పీలేరు నియోజకవర్గంలోనే లోకేష్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 8గంటలకు కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రంలో మైనారిటీలతో లోకేష్‌ ముఖాముఖిలో పాల్గొంటారు. 9గంటలకు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 9.30నిమిషాలకు కలికిరి జెఎన్ టియు వద్ద విద్యార్థులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొటారు. 11.30నిమిషాలకు వాయల్పాడు మండలం వాండ్లపల్లి వద్ద భోజన విరామం తీసుకుంటారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 1.30నిమిషాలకు రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 3.15నిమిషాలకు గంధబోయినపల్లిలో గ్రామస్థులతో భేటీ అవుతారు. 3.45నిమిషాలకు బీదవారిపల్లిలో స్థానికులతో మాట్లాడతారు. 5గంటలకు చింతపర్తిలతో ఎస్టీలతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటలకు బోయపల్లి క్రాస్ వద్ద చింతపర్తి విడిది కేంద్రం వద్ద పాదయాత్ర ముగిస్తారు. ఇక రాత్రికి లోకేష్‌ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story