Yuvagalam: 53వ రోజు లోకేష్‌ పాదయాత్ర

Yuvagalam: 53వ రోజు లోకేష్‌ పాదయాత్ర
9గంటలకు పెనుగొండలోని గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం

నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 53వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 661.4 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. యువనేత ఎక్కడికి వెళ్లిన జనప్రభంజనమే కన్పిస్తుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న ప్రజలు.. తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకుంటున్నారు. ఇక అందరికి అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ లోకేష్‌ ముందుకు సాగుతున్నారు. ఇక ఇవాళ పెనుగొండ నియోజకవర్గలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.

ఉదయం 9గంటలకు గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 10గంటలకు బాలన్నగారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. 10. 20 నిమిషాలకు మల్లపల్లిలో ఇటుక తయారీ కార్మికులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.30నిమిషలకు పాలసముద్రం క్రాస్ వద్ద బీసీలతో ముఖాముఖిలో పాల్గొంటారు లోకేష్‌. 1.30నిమిషాలకు పాలసముద్రం క్రాస్ వద్ద భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం అనంతరం 2.30నిమిషాలకు పాలసముద్రం క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. 2.35నిమిషాలకు పాలసముద్రం క్రాస్ వద్ద లాయర్లతో సమావేశం కానున్నారు. 2.55 నిమిషాలకు బెల్లాలచెరువు వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 3.30 నిమిషాలకు మిషన్ తండా వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. ఇక పాదయాత్రగా వెళ్లి ఎస్ఎల్ఎపి కంపెనీ, గుడిపల్లిలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 6.50 నిమిషాలకు నల్లగొండ్రాయనిపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్లి నల్లగొండ్రాయనిపల్లి విడిది కేంద్రానికి వెళ్తారు. రాత్రికి లోకేష్‌ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story