Yuvagalam: 55వ రోజుకు పాదయాత్ర.. 695.1 కిలోమీటర్లు పూర్తి

Yuvagalam: 55వ రోజుకు పాదయాత్ర.. 695.1 కిలోమీటర్లు పూర్తి
ఉదయం 8గంటలకు పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 55వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు లోకేష్ 695.1 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇక పాదయాత్రలో లోకేష్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. ఉదయం 8గంటలకు పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 8.15 నిమిషాలకు హరిపురంలో స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు లోకేష్‌. 9.35 నిమిషాలకు మునిమడుగు కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో ముచ్చటిస్తారు. 10.30 నిమిషాలకు అమ్మవారిపల్లిలో స్థానికులతో సమావేశం అయి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం పాదయాత్రగా గుట్టూరు చేరుకుంటారు. అక్కడితో లోకేష్ పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరిస్తారు.

ఇక మధ్యాహ్నం 12గంటలకు గుట్టూరు హైవే పక్కన కుంచిటిగ వక్కలింగ సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఒంటిగంటకు గుట్టూరు హైవే పక్కన భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2గంటలకు గుట్టూరు హైవే వద్ద నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారు. సాయంత్రానికి రాప్తాడు నియోజకవర్గంలోకి లోకేష్‌ పాదయాత్ర ఎంట్రీ అవుతుంది. సికెపల్లి, కోన రోడ్డులో స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. అక్కడి నుంచి పాదయాత్రగా సీ.కే పల్లి పంచాయితీ కోన క్రాస్‌ వద్దకు చేరుకుంటారు. ఇక్కడితో 55వ రోజు పాదయాత్ర ముగుస్తోంది. ఇక రాత్రికి అక్కడే విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story