Yuvagalam : పెనుకొండ వ్యాపారులకు నారా లోకేష్ హామీ

Yuvagalam : పెనుకొండ వ్యాపారులకు నారా లోకేష్ హామీ
X

అశేష జనవాహిని మధ్య యువగళం యాత్ర కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పెనుకొండ వ్యాపారులతో నారా లోకేష్‌ సమావేశం నిర్వహించారు.. వారి సమస్యలు తెలుసుకున్నారు.. జగన్‌ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు లోకేష్‌ దృష్టికి తీసుకొచ్చారు.. పన్నుల భారంతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి వచ్చిందని వాపోయారు.. వ్యాపారుల సమస్యలు విన్న లోకేష్‌.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరిగేలా చూస్తామన్నారు.. జగన్‌ ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీశారని లోకేష్‌ మండిపడ్డారు.. ప్రాపర్టీ ట్యాక్స్‌ అడ్డగోలుగా పెంచి పెను భారం వేశారన్నారు.. జే ట్యాక్స్‌ కట్టలేక వ్యాపారాలు మూసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

జే ట్యాక్స్‌ కట్టని వాళ్లని జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని నారా లోకేష్‌ మండిపడ్డారు.. వ్యాపారుల ఇళ్లలో గంజాయి పెట్టి అరెస్టు చేసి వేధిస్తోందన్నారు.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.. కానీ, ఏపీలో ఇంత వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదని లోకేష్‌ మండిపడ్డారు.

Tags

Next Story