Yuvagalam: 87వ రోజుకు యువనేత పాదయాత్ర

Yuvagalam: 87వ రోజుకు యువనేత పాదయాత్ర
అశేష జనవాహని మధ్య లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో .. లోకేష్ పాదయాత్ర నిన్న 1,100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవాల్టితో 87వ రోజు చేరింది. అశేష జనవాహని మధ్య లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో .. లోకేష్ పాదయాత్ర నిన్న 1,100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 1,100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా గోనెగండ్ల మండలంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు ద్వారా సుమారుగా 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అటు.. లోకేష్‌ అనేక సామాజికవర్గాలతో భేటీ అవుతున్నారు. గంజహళ్లిలో వాల్మీకి బోయల సమస్యల ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సత్యపాల్‌ కమిటీ నివేదిక ఆధారంగా పరిశీలిస్తామన్నారు. గోనెగండ్లలో కమ్యూనిటీ హాలు నిర్మించి, శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామన్నారు. చేనేత కార్మికుల కోసం సోమప్ప కేటాయించిన 24 ఎకరాలను వైసీపీ ఎమ్మెల్యే కబ్జా చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోనెగండ్ల MDO ఆఫీస్ వద్ద ముస్లిం సామాజిక వర్గీయులు లోకేష్‌ను కలిశారు. తమ సమస్యలు వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో యువతిని కిరాతకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే యువతి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కేసును సీబీఐతో విచారణ చేయించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వైసీపీ నేత సర్వే నెంబర్‌ 226, 227లోని శ్మశాన వాటికను ఆక్రమించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోనెగుండ్ల ఎస్సీ కాలనీ వాసులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. తమకు కొండలు, గుట్టలపై పట్టాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వి వా హాలకు ఆర్థిక ప్రోత్సహాకాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు చెందాల్సిన 28వేల 147కోట్ల రూపాయల సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. దళిత డాక్టర్లు అన్యాయంగా చంపేశారన్నారు. గతంలో మాదిరగా 27 సంక్షేమ పథకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.

రాళ్లదొడ్డిలో చేనేత కార్మికులతో లోకేష్‌ ముఖాముఖిలో పాల్గొన్నారు. జగన్‌ పాలనలో తాము నరకం అనుభవిస్తున్నట్లు లోకేష్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఎటువంటి సహకారం అందడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి రాగానే చేనేత వ్యవస్థను దత్తత తీసుకుంటానని హామీ ఇ చ్చారు. జీఎస్టీ కూడా లేకుండా చేస్తామని భరోసా కల్పించా రు. మగ్గం ఉన్న ప్రతి చే నేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story