సీమ వాసుల కోసం ప్రత్యేక మిషన్.. యువగళంలో లోకేష్

సీమ వాసుల కోసం ప్రత్యేక మిషన్.. యువగళంలో లోకేష్
అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేపడుతున్నారు.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. 11వ తేదీతో రాయలసీమలో లోకేష్‌ పాదయాత్ర ముగుస్తున్న తరుణంలో.. వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, సంస్థలు, ఉద్యోగులతో సమావేశం అవుతున్నారు. వారి సమస్యలపై స్పందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో చేపట్టిన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలపై అధ్యయనం చేసిన లోకేష్‌.. సీమ వాసుల కోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. చేపట్టే అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు. నాలుగేళ్లలో జగన్ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లో సిద్ధవటం తహశీల్దార్‌ ఆఫీస్‌ వద్ద బహిరంగ సభలో లోకేష్‌ ప్రసంగించనున్నారు. ఈ సభకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివెళ్లాయి.

Tags

Read MoreRead Less
Next Story