Yuvagalam Yatra: లోకేష్‌ యూత్‌ మేనిఫెస్టో...

Yuvagalam Yatra: లోకేష్‌ యూత్‌ మేనిఫెస్టో...
X
యువత, రైతులు, మహిళలపై హామీల వర్షం గుప్పించిన లోకేష్

దేశ చరిత్రలోనే తొలిసారిగా నారా లోకేష్ యూత్ మేనిఫెస్టో ప్రకటించారు. యువగళం సభలో టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో లోకేష్ ప్రజలకు స్పష్టంగా చెప్పారు. యువత, రైతులు, మహిళలపై హామీల వర్షం గుప్పించారు. యూత్ కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకొస్తామని లోకేష్ తెలిపారు. ప్రతియేటా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వలసవెళ్లిన యువతను రాష్ట్రానికి రప్పిస్తామని తెలిపారు. చెప్పారు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ప్రత్యేక కార్యాచరణతో కౌలు రైతులను ఆదుకుంటామని స్పష్టంచేశారు. పాత ఇసుక విధానం తీసుకొస్తామని.. సాగునీటి ప్రాజెక్టులను పునర్ నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Tags

Next Story