YuvaGalam Yatra: రెండవ రోజు మరింత ఉత్సాహంగా

X
By - Chitralekha |28 Jan 2023 12:32 PM IST
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్; విద్యార్థులతో నారా లోకేష్ సమావేశం; సమస్యలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజవకర్గంలో రెండో రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుప్పం అభివృద్ధికి టీడీపీ ఎంతో చేసిందని లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహారిస్తూ పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com