Yuvagalam Yatra: కుప్పంలో కవ్వింపు చర్యలు

Yuvagalam Yatra: కుప్పంలో కవ్వింపు చర్యలు
X
లోకేష్ ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన దుండగులు

తేదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. పాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే చెరువుకట్ట మీద స్థానిక కౌన్సలర్‌ ఏర్పాటు చేసిన బ్యానర్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తమ యువనేత లోకేష్‌ పాదయాత్రను చూసి వైసీపీ నాయకులకు వణుకు పుడుతోందన్నారు. అందుకే కవ్వింపు చర్యలకు దిగుతున్నారి విమర్శిస్తున్నారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Next Story