వీధి కుక్కలు రెచ్చిపోతున్నా GHMC పట్టించుకోవడంలేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నా GHMC పట్టిచుకోవడంలేదని అన్నారు బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వీధుల్లో చిన్న పిల్లలపై కుక్కలు వరస దాడులు చేస్తుంటే.. బల్దియాకు పట్టదా.. అని ప్రశ్నించారు. దేశంలోనే ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణ మున్సిపాలిటీల పరిస్థితి ఇలా ఉందంటూ ట్వీట్ చేశారు. "హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులు ఎన్ని ఘటనలు జరిగిన పట్టించుకోవడంలేదు, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడంలేదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయి.. కానీ విధి కుక్కల బెడదను తొలిగించడానికి మాత్రం పైసలు లేవంటున్నారు. మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నాం " అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు.
https://twitter.com/KVishReddy/status/1663839800795992064
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com