కాషాయం బికినీ రచ్చ ; దీపికా పదుకోన్ కు బాసటగా ప్రకాశ్ రాజ్

ముంబై
కాషాయం బికినీ రచ్చ ; దీపికా పదుకోన్ కు బాసటగా ప్రకాశ్ రాజ్
రెండు రోజులుగా పఠాన్ లో దీపికా బికినీ పై సాగుతున్న చర్చ. సనాతన సంప్రదయానికి మాయని మచ్చ అంటూ హిందూనేతల రచ్చ రచ్చ.

బాలీవుడ్

రీసెంట్ గా రిలీజ్ అయిన పఠాన్ టీజర్ ఓ వైపు మూవీ లవర్స్ కు మంచి కిక్ ఇస్తుంటే మరోవైపు రాజకీయంగా పెద్ద దుమారమే లేపుతోంది. ఇక ఇటీవలే సినిమాలోని బేషరమ్ రంగ్ సాంగ్ విడుదలవ్వడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. సాంగ్ లో సూపర్ హాట్ గా కనిపిస్తోన్న దీపిక పదుకోనే కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటే, పాటలో ఆమె వేసుకున్న బికినీలపై రాజకీయంగా శిఖరాగ్రస్థాయిలో రచ్చ జరుగుతోంది.

ఇంతకూ విషయం ఏమిటంటే బేషరమ్ రంగ్ పాటలో దీపిక వివిధ రకాల బికినీల్లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రసిద్ధ డిజైనర్లు రూపొందించిన సింగిల్ పీస్, టూ పీస్ బికినీల్లో, సూపర్ టోన్డ్ బాడీతో దీపిక సెగలు పుట్టిస్తోంది. కొంతకాలంగా గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్న దీపిక ఒక్కసారిగా డోస్ పెంచేసరికి అభిమానులు సైతం షాక్ అయ్యారనే చెప్పాలి. ఓ వైపు ఫ్యాషన్ ప్రపంచం దీపిక న్యూ లుక్ పై ప్రశంసలు కురిపిస్తోంటే మరోవైపు మోరల్ పోలీసింగ్ కు దిగిన హిందూవాద నేతలు సినిమాపై, దీపికపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తారాస్థాయిలో ఉన్న ఈ అంగ ప్రదర్శన హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకమంటూ సినిమాపై బ్యాన్ విధించాలని నినదిస్తున్నారు.

ముఖ్యంగా బేషరమ్ సాంగ్ లో దీపిక ధరించిన కాషాయం రంగు బికినీ ఈ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. సదరు రంగు హిందూ సంప్రదాయంలో భాగమని పలువురు నేతలు నిరసిస్తున్నారు. అయితే ఈ వివాదంలో దీపికకు మద్దతుగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నిలిచారు. ఈ ఆరోపణలు అర్థరహితమని వ్యాఖ్యానించారు. సాఫ్రాన్ బికినీలో దైవత్వాన్ని చూస్తున్నవారు కలర్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతున్నారని ఘాటుగా స్పందించారు.

మరోవైపు దీపికను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండటం వెనుక మరొక కోణం కూడా ఉందని తెలుస్తోంది. గతంలో దీపిక జేఎన్యూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాషాయం బికినీ కాంట్రావర్శీ వెనుక ప్రధానకారణం అదేనని అన్నవారు సైతం లేకపోలేదు.

Tags

Read MoreRead Less
Next Story