మూసేవాలను చంపినట్లే చంపేస్తాం..సల్మన్‌కు వార్నింగ్..నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపుతామంటూ మార్చ్ 18న వచ్చిన బెదిరిపు మెయిల్ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిదితుడిని 21 ఏళ్ల ధడక్ రామ్ బిష్ణోయ్‌గా గుర్తించారు. రాజస్థాన్‌లోని రోహిచా కలాన్ అనే గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. అయితే మెయిల్‌లో గోల్డీ భాయ్ సల్మాన్‌తో డైరెక్ట్‌గా మాట్లాడి సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడని, లేదంటే ఈ సారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు.
అలాగే పంజాబీ రాప్ సింగర్ సిద్ధూమూసే వాలాను చంపినట్లుగానే సల్మాన్‌ఖాన్‌ను సైతం అంతం చేస్తామని హెచ్చరించారు. దీంతో సల్మాన్ ఖాన్ స్నేహితుడు ప్రశాంత్ గున్‌జల్కర్(49) బంద్రా పోలీస్‌స్టేషన్‌లో రోహిత్ గార్గ్ అనే వ్యక్తి ఐడీతో మెయిల్ వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు నిదితుడు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం రాజస్థాన్‌లో పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. గోల్డీ భాయ్ అనే వ్యక్తి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడని తెలిపారు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ బిష్ణోయ్‌ల మనోభావాలను దెబ్బ తీశాడంటూ లారెన్స్ బిష్ణోయ్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com