నటి జియాఖాన్ ఆత్మహత్యపై నేడు తుది తీర్పు

నటి జియాఖాన్ ఆత్మహత్యపై నేడు తుది తీర్పు
పదేళ్ల క్రితం జుహూలోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డ జియాఖాన్; నటుడు సూరజ్ పంచోలి వల్ల మానసికంగానూ, శారీరికంగానూ హించించాడని సూసైడ్ నోట్ లో పేర్కొన్న జియా

సుమారు పదేళ్ల సుధీర్ఘ విచారణ తరువాత ముంబైలోని సీబీఐ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో తీర్పు ఇవ్వనుంది. 2013లో జూన్ 3న జియా ఖాన్ జుహూలోని తన స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె తన తల్లి రబియాఖాన్ గతపదేళ్లుగా కుమార్తె మరణానికి న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. నటుడు ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. జియా ఖాన్ సూసైడ్ నోట్ లో సూరజ్ తనను ఎన్ని రకాలుగా హింసించాలన్న విషయాలను పేర్కొంది. ఇదే విషయమై అరెస్ట్ అయిన సూరజ్ ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. అయితే నేడు అంతిమ తీర్పు వెలువడనుండటంతో సూరజ్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నేరం ఖరారు అయితే దాదాపు పదేళ్ల జైలు శిక్ష తోపాటూ జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story