ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్..వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు

బాలీవుడ్ స్టార్ షారూఖ్ కుమారుడి డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.. రెండేళ్ల క్రితం డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్ అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌లో కోర్డెలియా క్రూజ్ డ్రగ్స్ కేసును అప్పటి, ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో పాటు మరికొంత మంది అధికారులు విచారించారు.
ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు షారూఖ్ ఖాన్‌తో రహస్య ఒప్పందం కుదిరిందని.. అప్పటి ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే 25 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై, కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. అప్పట్లో వాంఖడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ కు చీఫ్‌గా ఉన్నారు. అప్పట్లో 22 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్‌కు తగిన సాక్ష్యాలు లేనందున ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com