బైక్ పై బిగ్ బీ... రయ్యి మంటూ షూటింగ్ స్పాట్ కి...

బైక్ పై బిగ్ బీ... రయ్యి మంటూ షూటింగ్ స్పాట్ కి...
ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకునేందుకు బిగ్ బీ ఉపాయం
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు తన హుందాతనంతో, నిడారంబరతతో అభిమానులను మురిపిస్తూనే ఉంటారు. తాజాగా ఇదే విధంగా నెటిజెన్ల మనసు చూరగొన్నారు బిగ్ బీ. ఇటీవల ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న అమితాబ్, షూటింగ్ కు సమయం మించిపోతుండటంతో అసాధారణ పనికి పూనుకున్నారు. ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ అవ్వదు అని నిర్ధారించుకున్నాక, ఉన్నట్లుండి కారు దిగిపోయారు. అటుగా వెళుతోన్న ఓ బైకర్ ను లిఫ్ట్ అడిగారు. బిగ్ బీకి అభిమాని అయిన సదరు బైకర్ ఆనందంగా సూపర్ స్టార్ కు లిఫ్ట్ ఇచ్చాడు. అలా షూటింగ్ స్పాట్ కు సమయానికి చేరుకున్నారు అమితాబ్. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బీనే తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తాను బైక్ ఎక్కిన ఫొటోను షేర్ చేస్తూ... పసుపు పచ్చ దుస్తులు ధరించిన వ్యక్తి(బైకర్)కు ధన్యవాదాలు తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story