యానిమల్ 'టీం'కు క్రష్మిక లేఖ

నేషనల్ క్రష్ రష్మిక మందన రన్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి క్రష్మిక ఓ నోట్‌తో పాటు కొన్ని ఫోటొలను జత చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
తాను ఈ సినిమా గురించి 50 రోజులు షూటింగ్‌లో గడిపానని తెలిపింది. రష్మిక నోట్ ఫర్ యానిమల్ టీం అని రాసుకొచ్చింది ఈ ముద్దు గుమ్మ. "యానిమల్ టీంతో పని చేయడం నాకు ఎంత సంతోషంగా ఉంది. దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు సడెన్‌గా అవకాశం వచ్చింది. నీను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ దాదాపు దాదాపు 50 రోజులు జరిగింది. సందీప్, రన్‌బీర్ అలాగే మిగతా వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వారికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా టీం మొత్తం నా డార్లింగ్స్.. సెట్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా ప్రొఫేషనల్స్, సహృదయులు వీరితో ఇంకో వెయ్యి సార్లు పని చేసిన కూడా చాలా సంతోషంగా ఉంటాను" అని రాసుకొచ్చింది ఈ సుకుమారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com