Sushant Singh Rajput Case : సుశాంత్ కేసులో ముగ్గురు అరెస్ట్..!

Sushant Singh Rajput Case :దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తితో పాటుగా మరో ఇద్దరని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు అరెస్ట్ చేశారు. గోవాలో వారిని అరెస్ట్ చేసి.. వారి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.
ఈ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. మార్చి 5న చార్జీషీట్ ఫైల్ చేసింది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో పాటు.. మరో 33 మంది జాబితాను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. 200 మంది సాక్షుల ఆఫిడివిట్ లను ఇందులో జత చేసింది.
కాగా గత ఏడాది జూన్‌లో ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకి పాల్పడిన సంగతి తెలిసిందే.. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సుశాంత్ ది ఆత్మహత్యేనని గుర్తించారు.
అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపించడంతో.. ఈ కేసును సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సిబిఐ) కు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com