ఐశ్వర్యరాయ్ నా తల్లి.. నేనే ముందు పుట్టాను!

తన అందచందాలతో బాలీవుడ్‌ని కొన్నేళ్లపాటూ ఏలిన క్వీన్ ఐశ్వర్యరాయ్‌కి ఓ 32 ఏళ్ల వ్యక్తి షాక్ ఇచ్చాడు. తాను ఐశ్వర్యరాయ్ కుమారుడినని ఆరోపిస్తున్నాడు. అతని పేరు సంగీత్ కుమార్. ఐషూకి IVF విధానంలో 1967లో జన్మించినట్లు వెల్లడించాడు. అప్పటికి ఐశ్వర్యరాయ్ వయస్సు 15 సంవత్సరాలని తెలిపాడు.
అయితే తన తండ్రి తనను లండన్ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారని.. ఆ తర్వాత రెండేళ్లపాటు ఆమె తల్లిదండ్రులే తన బాగోగులు చూసుకున్నట్లు చెబుతున్నాడు. అనంతరం ఐషూ బంధువులు తన బర్త్ సర్టిఫికేట్లు నాశనం చేసినట్లు ఆరోపించాడు. ఇప్పుడు అతను తన తల్లైన ఐశ్వర్యరాయ్‌తో ముంబైలో ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు అతన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి మానసిక స్థితి బాగోలేదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com