సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలకు సంబంధించి..

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్‌ల పర్వం ప్రారంభమయ్యింది. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. రియానే డ్రగ్స్‌ తీసుకురమ్మందని ఆమె సోదరుడు షోవిక్‌ అధికారులకు తెలిపాడు. ఎన్‌సీబీ సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతోపాటు డ్రగ్‌ డీలర్లు జైద్‌ విలాత్ర, బిసిత్‌ పరిహార్‌లను కూడా అరెస్ట్‌ చేశారు. వీరంతా గంజాయి అమ్మకంలో భాగస్వాములని అధికారులుభావిస్తున్నారు.

ఇప్పటికే డ్రగ్‌ డీలర్‌ అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను సెప్టెంబర్ 9 వరకు ఎన్‌సీబీ కస్టడీకి పంపారు. జైద్ విలాత్రా విచారణ ఆధారంగా బాసిత్‌ పరిహార్‌ను దర్యాప్తులో చేర్చారు. శామ్యూల్‌ మిరాండా సుశాంత్‌ సింగ్‌ ఇంటిలో హౌస్‌ కీపింగ్‌ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్‌ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్‌ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్‌ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించాడని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్‌ విలాత్రాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్‌ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్‌సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళో రేపో రియాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story