Aaliyah Kashyap: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న స్టార్ డైరెక్టర్ కూతురు..

Aaliyah Kashyap: బాలీవుడ్‌లో విమర్శలను పట్టించుకోకుండా తమకు నచ్చింది చేసుకుంటూపోయే వారు చాలామంది ఉన్నారు. అందులో దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఒకరు. అందుకే ఇతర దర్శకులతో పోలిస్తే అనురాగ్ తెరకెక్కించే సినిమాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇక తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ కూతురి సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. దానికి కారణం తన బాయ్‌ఫ్రెండే.
అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ రెండేళ్లుగా షేన్ గ్రెగోయిర్ అనే యువకుడితో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరి ముందుగా ఓ డేటింగ్ యాప్‌లో కలిసినా కూడా జీవితాంతం కలిసుండాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికీ వీరి రిలేషన్‌షిప్ మొదలయ్యి రెండేళ్లు అవ్వడంతో షేన్ తన సోషల్ మీడియాలో ఒక రొమాంటిక్ ఫోటోతో పాటు ఓ స్పెషల్ నోట్‌ను షేర్ చేశాడు.
'నా ప్రియురాలికి హ్యాపీ 2 ఇయర్ యానివర్సరీ. నువ్వు ప్రతీ విషయంలో నా పార్ట్‌నర్ మాత్రమే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ప్రతీరోజు నువ్వు నాకిస్తున్న సంతోషానికి, నేను నాలాగా ఉండడానికి, ఎదగడానికి ఇస్తున్న అవకాశానికి, చాలా రుణపడి ఉంటాను. నీ వేలికి ఉంగరం తొడిగే రోజు కోసం ఎదురుచూస్తున్నాను' అని తమ రొమాంటిక్ ఫోటోను షేర్ చేశాడు షేన్. దీంతో వీరు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ రూమర్స్ బాలీవుడ్‌లో వైరల్ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com