15 ఏళ్ల వివాహ బంధానికి అమీర్‌ఖాన్, కిరణ్‌రావు గుడ్‌బై..!

బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు తమ 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నారు. 'కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం'అని శనివారం ప్రకటించారు. తెలుగు కుటుంబానికి చెందిన కిరణ్ రావు రచయితగా, డైరెక్టర్ గా గుర్తింపు పొందింది. కాగా అమీర్ ఖాన్, కిరణ్ రావు లది ప్రేమ వివాహం కావడం విశేషం. 'లగాన్' సినిమాకి కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీనితో 2005లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. అటు అమీర్ ఖాన్ కి ఇది రెండో వివాహం. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు అమీర్ ఖాన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com