Aamir Khan: 'లాల్ సింగ్ చడ్డా' తెచ్చిపెట్టిన నష్టం.. అమీర్‌పై రూ.100 కోట్ల భారం..

Aamir Khan: లాల్ సింగ్ చడ్డా తెచ్చిపెట్టిన నష్టం.. అమీర్‌పై రూ.100 కోట్ల భారం..
Aamir Khan: ఇంగ్లీష్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది ‘లాల్ సింగ్ చడ్డా’.

Aamir Khan: స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో ఆకాశాన్నంటే అంచనాల మధ్య విడుదలవుతాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆ అంచనాలను కొన్ని సినిమాలు మాత్రమే అందుకోగలుగుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన సినిమాలతో నష్టాన్ని మాత్రమే మూటగట్టుకుంటున్నారు. ఇక లాల్ సింగ్ చడ్డా వల్ల అమీర్ ఖాన్‌పై కోలుకోలేని దెబ్బే పడింది.

ఇంగ్లీష్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది 'లాల్ సింగ్ చడ్డా'. కానీ ఇది ఒక పర్ఫెక్ట్ రీమేక్ అని ప్రేక్షకుల చేత అనిపించుకోలేకపోయింది. దీంతో థియేటర్లు రెండోరోజు నుండే ఖాళీ అయ్యాయి. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతే కాకుండా తెలుగు, హిందీలో స్టార్లతో ప్రమోషన్స్ చేయించాడు. కానీ అవేవి మూవీ రిజల్ట్‌ను మార్చలేకపోయాయి.

థియేటర్లు ఖాళీ అవ్వడంతో లాల్ సింగ్ చడ్డా బిజినెస్ నష్టాలతోనే ముగిసింది. దీని ప్రకారం ఏకంగా ఈ మూవీ వల్ల రూ.100 కోట్ల నష్టం వచ్చినట్టు సమాచారం. అయితే ఈ నష్ట భారాన్ని ఎవరిపైన పడనివ్వకుండా పూర్తిగా తానే భరిస్తానని అమీర్ ఖాన్ హామీ ఇచ్చాడట. ఇప్పటివరకు లాల్ సింగ్ చడ్డా మొత్తంగా రూ.60 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించగలిగింది.

Tags

Read MoreRead Less
Next Story