Aamir Khan: సినిమాల నుండి అమీర్ ఖాన్ రిటైర్మెంట్.. అదే చివరి చిత్రం..

Aamir Khan: కొందరు నటీనటులు సినిమాల కోసం ఎంత కష్టపడడానికి అయినా వెనకాడరు. పాత్రకు తగినట్టుగా మారిపోవడానికి ఎంతో కష్టపడతారు. అలాంటి నటీనటులలో ఒకరు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌కు ఉన్నంత డెడికేషన్ మరెవరికీ లేదు అంటుంటారు. అలాంటి అమీర్ ఖాన్.. తన ఫ్యాన్స్‌కు షాకివ్వబోతున్నాడు. త్వరలోనే సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు.
కోవిడ్ సమయంలో ఎవరూ ఇంట్లో నుండి బయటికి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి రోజుల్లోనే ఫ్యామిలీతో, తన వాళ్లతో కలిసి సమయాన్ని గడపడం అనేది ఎంత ముఖ్యమని అమీర్ ఖాన్ గ్రహించాడట. ఇదే విషయాన్ని లాక్‌డౌన్ ముగిసిన తర్వాత అమీరే స్వయంగా వెల్లడించాడు. అంతే కాకుండా అప్పుడే తన రిటైర్మెంట్ విషయాన్ని కూడా బయటపెట్టాడు. అమీర్ ఇప్పటికీ అదే మాట మీద నిలబడినట్టు సమాచారం.
ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చడ్డా' తన డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలన్నది అమీర్ ప్లాన్. హిందీతో పాటు పలు ఇతర భాషల్లో కూడా లాల్ సింగ్ చడ్డా విడుదల కానుంది. అయితే ఈ చిత్రంపై అమీర్ స్పెషల్ ఫోకస్ పెట్టడానికి తన రిటైర్మెంట్ కూడా ఒక కారణమట. అందుకే తెలుగులో చిరంజీవిలాంటి హీరో సైతం అమీర్ చివరి చిత్రాన్ని ప్రెజెంట్ చేయడానికి సిద్ధమయినట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. తమ ఫేవరెట్ హీరోను స్క్రీన్ పై చూడడం మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారు అమీర్ ఖాన్ ఫ్యాన్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com