సుశాంత్ తరహాలోనే మరో యువ నటుడు ఆత్మహత్య

సుశాంత్  తరహాలోనే  మరో యువ నటుడు ఆత్మహత్య

ముంబైలో మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరహాలోనే బుల్లితెర నటుడు అక్షత్‌ ఉత్కర్ష్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముంబై అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. బీహార్‌కు చెందిన ఈ నటుడు సీరియల్స్‌తోపాటు కొన్ని భోజ్‌పురి సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో ముంబైలో స్థిరపడ్డాడు. రెండేళ్ల క్రితం ముంబై వచ్చిన అక్షత్‌ అంధేరి వెస్ట్‌లో స్నేహ చౌహాన్‌ అనే యువతితో కలిసి ఉంటున్నాడు.

ఇటీవల లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఉత్కర్ష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. ఉత్కర్ష్ మానసిక ఒత్తిడికి లోనయి చనిపోలేదని, అతనిని హత్య చేసి చంపేశారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags

Next Story