ఇండస్ట్రీని వదిలేసి.. రైతుగా మారిన బాలీవుడ్ హీరో.. !

ఒకప్పుడు వ్యవసాయం చేయడం అంటే నామోషీగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ లాంటి దిగ్గజ నటులు కూడా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే బాటలో మరో హీరో కూడా నడుస్తున్నాడు. ఏకంగా సినిమాలను వదిలేసి ఇండస్ట్రీకి దూరంగా ఉండి మరి వ్యవసాయం చేస్తున్నాడు. 40 ఆవులు, 40 ఎకరాల పొలం తీసుకుని హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతికి దగ్గరగా బతికేస్తున్నాడు ఈ హీరో.
ఆ నటుడి పేరు... ఆశిష్ శర్మ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'మోదీ.. జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్' లో నటించి హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సినిమా ఫీల్డ్ ని వదిలేసి పూర్తిగా రైతుగా మారిపోయాడు. ఇప్పుడు అతను ముంబైకి దూరంగా రాజస్థాన్‌లో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్న ఫోటోలను ఆశిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం తన లక్ష్యం ఆరోగ్యకరమైన పంటలను పండించడమే అని చెప్పుకొచ్చాడు. ఇక వ్యవసాయం మన పూర్వీకుల సంప్రదాయమని, దానిని ప్రోత్సహించడం కోసం కృషి చేస్తానని తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com