Asin Divorce News: విడాకులపై స్పందించిన అసిన్

Asin Divorce News: విడాకులపై స్పందించిన అసిన్
X
హాలీడే మధ్యలో మాకీ గోలేంటి... అంటోన్న అసిన్

తెలుగు వారిని మురిపించి, బాలీవుడ్ జనాలను కవ్వించిన చెన్నై చంద్రం అశిన్, కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోతుండగానే వ్యాపారవేత్త అయిన రాహుల్ శర్మను వివాహమాడి సినిమాలకు టాటా చెప్పేసింది. ఆ సమయంలో ఎన్ని కుర్ర హృదయాలు భగ్గుమన్నాయో లెక్కే లేదు. అనంతరం ఓ చిన్నారికి తల్లి అయిన అశిన్, అడపాదడపా సోషల్ మీడియాలో దర్శనమివ్వడం తప్పితే పెద్దగా లైమ్ లైట్ లో కనిపించలేదు. ఇక ఇతర హీరోయిన్ల మాదిరి అమ్మడి రీ ఎంట్రీ కూడా ఉండదని అటు ఫ్యాన్స తో పాటూ ఇటు సినీ జనం కూడా ఫిక్స్ అయిపోయారు. ఇహ ఇంతలోనే ఓ నెగిటివ్ న్యూస్ తో అశిన్ మరోసారి హెడ్ లైన్స్ ఎక్కడం శోచనీయమనే అనాలి.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అశిన్, ఈ మధ్య తన పేజ్ నుంచి భర్త రాహుల్ శర్మ ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో అమ్మడు కూడా విడాకుల బాట పడుతోందని అంతా భావించారు. సెలబ్రిటీలు తమ విడాకుల వార్తను ఇదే విధంగా జనాలకు తెలియజేస్తుండటంతో అశిన్ కూడా భర్తతో తెగదెంపులు చేసుకుంటోందని అంతా భావించారు. కొందరు అత్యుత్సాహవంతులైతే ఏకంగా అమ్మడు భారీ మెయిన్ టెన్స్ కూడా కోరుతోందని చెప్పుకొచ్చారు. దీంతో అశిన్ స్పందించక తప్పలేదు.


తన ఇన్స్టా పేజ్ ద్వారా ఈ వివాదంపై స్పందించిన అశిన్, ఈ గాలి వార్తలకు తెరలేపిన వారిపై మండిపడింది. తాము ఇప్పుడు సమ్మర్ హాలీడే వెకేషన్ లో ఉన్నామని, ఇలాంటి సమయంలో ఈ వార్తలు రావడం శోచనీయమని వ్యాఖ్యానించింది. తమ పెళ్లి సమయంలోనూ ఇలానే బ్రేక్ అప్ రూమర్లు వచ్చాయని, అప్పుడు కూడా వారి అవివేకానికి ఇలాగే నవ్వుకున్నామని తెలిపింది. అసలు తమ హాలీడేలో ఇలాంటి రూమర్లకు స్పందించడమే వేస్ట్ అని తీసిపారేసింది. ఏమైనా తామిద్దం చాలా హ్యాపీగా ఉన్నామని అమ్మడు చెప్పకనే చెప్పింది.


Tags

Next Story