Mahima Chaudhry : ఇండస్ట్రీ ఒకప్పుడు కన్యలను మాత్రమే కోరుకునేది : మహిమా చౌదరి

Mahima Chaudhry : ఇండస్ట్రీ ఒకప్పుడు కన్యలను మాత్రమే కోరుకునేది :  మహిమా చౌదరి
X
Mahima Chaudhry : బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ కన్యలనే కోరుకునేది అని వ్యాఖ్యలు చేసింది.

Mahima Chaudhry : బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ కన్యలనే కోరుకునేది అని వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేసారు. ఓ హీరోయిన్ ఎవరితోనైనా డేటింగ్ మొదలుపెట్టినా, పెళ్లి చేసుకున్న అంతటితో ముగిసిపోయేదని అప్పటి పరిస్థితులను ఆమె గుర్తుచేసుకున్నారు.

కానీ ఇప్పుడలా కాదని పరిస్థితులు మారిపోయాయని.. ప్రేక్షకులు విభిన్నమైన పాత్రల్లో మహిళలను అంగీకరిస్తున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా 1997లో 'పార్దేస్' సినిమాతో మహిమా తన కెరీర్‌ని ప్రారంభించింది. 'పార్దేస్' లో షారుఖ్ ఖాన్ మరియు అపూర్వ అగ్నిహోత్రి ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్ ఘని దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.

మహిమా 2006 సంవత్సరంలో బాబీ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఈ జంటకి 2007 లో అరియానా అనే కుమార్తె ఉంది. ఈ జంట 2013లో విడాకులు తీసుకున్నారు. తిరిగి వివాహం చేసుకోలేదు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆమె.. సోషల్ మీడియాలో చాలానే యాక్టివ్‌గానే ఉంటున్నారు.

Tags

Next Story