Sidharth Shukla death : సిద్ధార్థ్‌ శుక్లా మరణం : కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్‌..!

Sidharth Shukla death : సిద్ధార్థ్‌ శుక్లా మరణం : కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్‌..!
X
Sidharth Shukla death : బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌-13 విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లా గుండెపోటుతో మృతి చెందారు. నిద్రలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లు డాకర్లు వెల్లడించారు.

Sidharth Shukla death : బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌-13 విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లా గుండెపోటుతో మృతి చెందారు. నిద్రలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లు డాకర్లు వెల్లడించారు. సిద్ధార్థ్‌ శుక్లా మరణవార్త వినగానే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఆయన ప్రేయసి, బిగ్‌బాస్‌ సహ కంటెస్టెంట్‌ షెహనాజ్‌ గిల్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లుగా తెలుస్తోంది. ఈ వార్త వినగానే ఆమె కుప్పకూలిపోయిందని సమాచారం. బిగ్‌బాస్‌ సీజన్‌13లో పాల్గొన్న సిద్ధార్ద్ -షెహనాజ్‌ల లవ్‌ ట్రాక్‌ ఫుల్ సక్సెస్ అయింది. ఈ జంటకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. 1980 డిసెంబర్‌12న ముంబైలో జన్మించిన శుక్లా 'హంప్టీ శర్మ కి దుల్హనియా' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు.

Tags

Next Story