Kangana Ranaut : కంగనాకు మరో షాక్

ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వివాదాలతోనే బిజీగా ఉంటుంది. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. సోషల్‌మీడియాలో పోస్ట్‌లతో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకి సోషల్ మీడియా సంస్థలు షాకులిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఆమె ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అవ్వగా.. తాజాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇటీవల కరోనాబారిన పడిన కంగనా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఫేక్ న్యూస్ చెబుతుందంటూ పోస్టు తొలగించారు. ఈ విషయాన్ని కంగనా స్టోరీ ద్వారా వెల్లడించింది.
''కోవిడ్‌ను నేను నాశనం చేస్తాను అంటూ పోస్ట్ చేస్తే కొందరు హర్ట్ అయ్యారట. అందుకే ఇన్‌స్టాగ్రామ్ నా పోస్ట్‌ని తొలగించింది. ఇప్పటివరకూ టెర్రరిస్టులకు, కమ్యూనిస్టులకు మద్దతుదారులు ఉంటారని ట్విట్టర్‌లో విన్నాను. కానీ, ఇక్కడ కోవిడ్ ఫ్యాన్ క్లబ్ ఉంది. అద్భుతం. ఇన్‌స్టాకి వచ్చి కొన్ని రోజులే అవుతుంది. కానీ, ఇక్కడ ఇంకో వారానికి మించి ఉంటానని నాకు అనిపించడం లేదు'' అంటూ కంగనా పోస్ట్ చేసింది. అటు కంగనా తాజాగా చిత్రం 'తలైవి' కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com