Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ మళ్లీ ప్రెగ్నెంట్..! వైరల్ అవుతున్న వీడియో..

Aishwarya Rai: బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ బచ్చన్.. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో తన హవా ఏ మాత్రం తగ్గడం లేదు. అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయిన ఐశ్వర్య.. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. అప్పుడప్పుడు పలు చిత్రాల్లో కనిపించినా కూడా మళ్లీ ఎందుకో అవి కూడా చేయడం మానేసింది. తాజాగా ఐశ్వర్య రాయ్ మళ్లీ ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌కు పదేళ్ల కూతురు ఉంది. తనే ఆరాధ్య బచ్చన్. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరు తమ రెండో బిడ్డ గురించి ప్లాన్ చేసుకున్నారట. ఇప్పటికే ఒకసారి ఐశ్వర్య రెండో బిడ్డ గురించి రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ రూమర్స్ తెరపైకి రావడానికి కారణం ఇటీవల ఎయిర్‌పోర్టులో తన ప్రవర్తనే అంటోంది బాలీవుడ్ మీడియా.
ఇటీవల ఆరాధ్య, ఐశ్వర్య, అభిషేక్.. పారిస్ ట్రిప్‌కు వెళ్లారు. తిరిగొచ్చినప్పుడు ముంబాయి ఎయిర్‌పోర్టులో వీరి ఫ్యామిలీ ఫోటో తీయడానికి ప్రయత్నించారు అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్. అదే సమయంలో ఐశ్వర్య ఓ లూస్ డ్రెస్ వేసుకోవడం, ఊరికే తన పొట్టను కవర్ చేసుకోవడానికి ట్రై చేయడం నెటిజన్లలో అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. అంతే కాకుండా కొందరు నెటిజన్లు.. ఐశ్వర్య బేబి బంప్ స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com