జై శ్రీరామ్... రాములోరికి సాయం చేద్దాం రండి!

జై శ్రీరామ్...  రాములోరికి సాయం చేద్దాం రండి!
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గాను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ విరాళాలను సేకరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే..

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గాను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ విరాళాలను సేకరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరాళాలు ప్రకటించారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళం అందజేసినట్లుగా పేర్కొన్నాడు. రామమందిర నిర్మాణానికి సహకరించడం అందరి బాధ్యతని అన్నాడు. రామసేతుకు ఉడత సాయం చేసినట్లు.. మనం కూడా ఉడతా భక్తిగా సహాయం చేయాలని కోరాడు.

ప్రజలంతా ఈ చారిత్రాత్మక కట్టడ నిర్మాణంలో భాగస్వామ్యులు అవ్వాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు జై శ్రీరామ్ అంటూ.. అక్షయ్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ పవిత్ర కార్యంలో తన అభిమానులతో పాటు సామాన్యులు కూడా పాల్గొని పెద్ద ఎత్తున రామ జన్మభూమికి విరాళాలు అందించాలని కోరారు.

అయితే అక్షయ్ కుమార్ ఎంత విరాళం ఇచ్చాడన్నది మాత్రం వెల్లడించలేదు! అటు అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం అయన... 'బచ్చన్ పాండే' షూటింగ్‌తోపాటుగా, 'పృథ్వీరాజ్' అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు రామ్ సేతు అనే సినిమాని కూడా చేస్తున్నాడు అక్షయ్!

Tags

Read MoreRead Less
Next Story