Akshay Kumar: సౌత్ సినిమాలతో పోటీకి సిద్ధమంటున్న అక్షయ్.. వెనక్కి తగ్గనంటూ..

Akshay Kumar: సౌత్ సినిమాలతో పోటీకి సిద్ధమంటున్న అక్షయ్.. వెనక్కి తగ్గనంటూ..
Akshay Kumar: ఇలా మూడు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదవ్వడంపై అక్షయ్ కుమార్ స్పందించాడు.

Akshay Kumar: ఈ ఏడాది మొదటి నుండి థియేటర్లలో సినిమాల సందడి మరింత పెరిగింది. వారానికి ఒక సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో చాలావరకు సినిమాలు హిట్ టాక్ అందుకుంటున్నాయి కూడా. ఇక సౌత్‌తో పోలిస్తే కాస్త వెనకబడిన బాలీవుడ్ ఇప్పుడిప్పుడే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటోంది. ఇదే విషయంపై తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు.

జూన్ 3న బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీనే జరగనుంది. ఒకవైపు తెలుగు నుండి అడవి శేష్ నటించిన 'మేజర్' చిత్రం అదే రోజు విడుదలకు సిద్ధమయితే.. మరోవైపు తమిళం నుండి కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ మల్టీ స్టారర్ 'విక్రమ్' కూడా అదే రోజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే వీటి మధ్యలో అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్విరాజ్' కూడా పోటీకి దిగనుంది.

ఇలా మూడు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదవ్వడంపై అక్షయ్ కుమార్ స్పందించాడు. 'అందరి సినిమాలు నడవాలని కోరుకుంటున్నాను. సినిమాలు విడుదలవ్వకుండా మనం ఆపలేము కదా.. అందుకే ప్రతీ సినిమా మంచి బిజినెస్‌ను చేయాలని కోరుకుంటున్నాను. బిజినెస్ ఒక్కటే మమ్మల్ని కనెక్ట్ చేసేది' అని విక్రమ్, మేజర్ సినిమాల గురించి స్పందించాడు అక్షయ్.

'మేము ఒకరం లేకుండా ఒకరం ఉండలేం. మేం కలిసి ఉండలేము అనుకోవడం తప్పు. మేము వాళ్లు లేకుండా ఉండలేం. వారు మేము లేకుండా ఉండలేరు. మేము ఎప్పుడూ ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటాను కానీ దురదృష్టవషాత్తు నాకు ఇక్కడ అది కనిపించడం లేదు. అందరూ విడిపోవడం గురించి మాట్లాడతారు తప్ప కలిసుండడం గురించి మాట్లాడరు. త్వరలోనే నేర్చుకుంటామని కోరుకుంటున్నాం' అంటూ బాలీవుడ్‌కు, సౌత్ సినిమాలకు మధ్య ఉండాల్సిన బంధం గురించి వివరించాడు అక్షయ్ కుమార్.

Tags

Next Story