Akshay Kumar: 'అల్లు అర్జున్ నాతో నటిస్తే బాగుంటుంది': అక్షయ్ కుమార్

Akshay Kumar: అల్లు అర్జున్ నాతో నటిస్తే బాగుంటుంది: అక్షయ్ కుమార్
Akshay Kumar: 'విభజించు పాలించు అనే పద్ధతిని సృష్టించడానికి ప్రయత్నించకండి. సౌత్, నార్త్ అని తేడాలు ఏమీ లేవు'

Akshay Kumar: ప్రస్తుతం బాలీవుడ్‌కు, సౌత్ సినిమాలకు మధ్య విపరీతమైన పోటీ జరుగుతోంది. సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ చిత్రాలు సక్సెస్ రేటులో వెనకంజలో ఉన్నాయి. అందుకే బాలీవుడ్ నటీనటులు వెళ్లిన ప్రతీచోటికి వారికి సౌత్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు అక్షయ్ కుమార్ విసిపోయి.. ఇటీవల అందరికీ గట్టి సమాధానమే ఇచ్చాడు.

జూన్ 3.. ఒకవైపు టాలీవుడ్, మరోవైపు కోలీవుడ్, ఇంకొకవైపు బాలీవుడ్.. ఈ మూడు ఇండస్ట్రీల నుండి మూడు పెద్ద సినిమాలు ఈ ఒక్కరోజే పోటీకి దిగుతున్నాయి. కమల్ హాసన్ నటించిన విక్రమ్, అడవి శేష్ నటించిన 'మేజర్'లతో అక్షయ్ కుమార్ 'పృథ్విరాజ్' పోటీకి దిగుతుంది. ఇక పృథ్విరాజ్ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్న అక్షయ్ కుమార్.. సౌత్ సినిమాలతో పోటీ గురించి సమాధానం చెప్పలేక విసిగిపోయాడు.

'విభజించు పాలించు అనే పద్ధతిని సృష్టించడానికి ప్రయత్నించకండి. సౌత్, నార్త్ అని తేడాలు ఏమీ లేవు.. అన్నీ ఒకటే. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా నటీనటులు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చేసింది. అల్లు అర్జున్ త్వరలోనే నాతో పని చేయాలి. నేను ఇంకో సౌత్ హీరోతో పనిచేస్తాను. ఇప్పటినుండి ఇలా ముందుకెళ్తే బాగుంటుంది.' అని అక్షయ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story