సినిమాకు టాక్ లేదు.. అయినా ఒక్కరోజులోనే రూ.1000కోట్లకు సమానమైన రికార్డు!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ , కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `లక్ష్మీ`. తెలుగు `కాంచన` చిత్రానికి ఇది హిందీ రీమేక్. నవంబర్ 9న ఈ చిత్రం విడుదల అయింది. హర్రర్-కామెడీ జోనర్ లో వచ్చిన ఈ చిత్రాన్ని డిస్నీ తోపాటు హాట్‌స్టార్‌లో విడుదల చేశారు మేకర్స్.. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. జనాదరణ పొందిన OTT ప్లాట్‌ఫామ్‌లో అతిపెద్ద మూవీ ఓపెనింగ్‌గా ఈ చిత్రం నిలిచింది.
చిత్రం విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది.. 24 గంటల్లో ఏకంగా 200 మిలియన్ల పైచిలుకు వ్యూస్ సాధించింది. ఇంతవరకూ ఏ చిత్రం ఇన్ని వ్యూస్ ను రాబట్టలేదు. అయితే అంతకుముందు, ఈ రికార్డు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 'దిల్ బెచారా' పేరిట ఉంది. జూన్ 24, 2020న విడుదల అయిన ఈ చిత్రం 95 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ రికార్డును `లక్ష్మీ` సినిమా బ్రేక్ చేసింది. ఈ సినిమాకు టాక్ లేకపోయినా.. ఒక్కరోజులోనే రూ.1000కోట్లకు సమానమైన రికార్డును సాధించిందని సినిమా ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com