Alia Alongside Young Tiger: యంగ్ టైగర్ సినిమాలో ఆలియా!

Alia Alongside Young Tiger: యంగ్ టైగర్ సినిమాలో ఆలియా!
వార్ 2 సినిమాలో హీరోయిన్ గా ఆలియాభట్
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ తల్లైన తరువాత మరింత స్పీడు పెంచుతోంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తో మాంచి ఊపు మీద ఉన్న ఆలియా వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తోంది. ఇందులో భాగంగానే అమ్మడు వార్ 2లో లీడ్ రోల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ రోల్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మొదటి భాగంలో చేసిన పాత్రలోనే కంటిన్యూ అవ్వబోతున్నాడు. ఇక మొదటి భాగానికి సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, రెండవ భాగానికి అయాన్ ముఖర్జీని తీసుకువచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story