Alia Bhatt: డెలివరీ తర్వాత ఆలియా కెరీర్‌కు బ్రేక్..? క్లారిటీ ఇచ్చిన నటి..

Alia Bhatt: పెళ్లి తర్వాత నటీమణుల కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టే అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఈరోజుల్లో అలా జరగడం లేదు. పెళ్లయినా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమందికి పిల్లలు కూడా ఉన్నారు. ఇక బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ఆలియా భట్ కూడా తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. మరి దీని తర్వాత తన కెరీర్ పరిస్థితి ఏంటి..?
ఆలియా భట్.. తన కెరీర్ మొదట్లోనే పలు పెద్ద చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఆలియా కెరీర్‌కు పెద్ద బ్రేక్‌గా నిలిచాయి. క్షణం కూడా తీరిక లేకుండా వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్న సమయంలోనే ఆలియా.. రణబీర్‌ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ను స్టార్ట్ చేసింది. అంతే కాకుండా పెళ్లయిన రెండు నెలల్లోనే తాను ప్రెగ్నెంట్ అని కూడా ప్రకటించింది.
ప్రస్తుతం ఆలియా మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. తను హీరోయిన్‌గా నటించిన 'డార్లింగ్స్' చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తను కూడా ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇలాంటి సందర్భంలోనే డెలివరీ తర్వాత ఆలియా సినిమాల్లో నటిస్తుందా లేదా అనే ప్రశ్న ఎదురయ్యింది. డెలివరీ తర్వాత కూడా తను ఎక్కువ బ్రేక్ తీసుకోనని, వెంటనే షూటింగ్స్‌లో పాల్గొంటానని క్లారిటీ ఇచ్చింది ఆలియా భట్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com