Alia Bhatt: పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నా: ఆలియా

Alia Bhatt: లాక్‌డౌన్ మొదలయిన తర్వాత ఎన్నో బాలీవుడ్ ప్రేమజంటలు పెళ్లి పీటలెక్కాయి. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ కూడా పెళ్లితో ఒకటయ్యారు. తాజాగా వీరిద్దరు పేరెంట్స్ కాబోతున్నారన్న విషయాలన్ని కూడా బయటపెట్టారు. ఇక ఈ గుడ్ న్యూస్ వెల్లడించిన తర్వాత మొదటిసారి ఆలియా, రణబీర్ తమ భావనలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
చాలామంది తాను 30ల్లో పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నారని ఆలియా తెలిపింది. కానీ ఏదీ మన చేతుల్లో ఉండదు కదా! ఆ సమయమొచ్చినప్పుడు అది జరిగి తీరుతుంది అని ఆలియా అంటోంది. పిల్లల విషయంలో ముందు నుంచే తనకో స్పష్టత ఉందని చెప్పుకొచ్చింది. పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నానని స్పష్టం చేసింది. నా ఇష్టసఖుడితో వివాహం, ఆ వెంటనే అమ్మను కాబోతుండడం.. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది?!' అని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది ఈ యంగ్ బ్యూటీ.
ఈ ఏడాది తన జీవితంలో జరిగిన సంతోషకర పరిణామం ఆలియాతో పెళ్లి అంటున్నారు రణబీర్ కపూర్. తండ్రిని కాబోతున్నానన్న ఆనందం దీన్ని రెట్టింపు చేసిందన్నాడు. ఇప్పటివరకు తన శరీరంపై ఎలాంటి ట్యాటూలు లేవని, కానీ త్వరలోనే తమ పిల్లల పేరు మీద ట్యాటూ వేయించుకోవాలనుకుంటున్నానని తెలిపాడు రణబీర్. ఆలియా.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తిచేసి రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com