Alia Bhatt: తెలుగు, తమిళంలో రీమేక్ కానున్న ఆలియా భట్ సినిమా..

Alia Bhatt: తెలుగు, తమిళంలో రీమేక్ కానున్న ఆలియా భట్ సినిమా..
Alia Bhatt: ఆలియా భట్ తన చిత్రాన్ని ఒకే భాషలో తెరకెక్కించి వేరే భాషల్లో రీమేక్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Alia Bhatt: ఇటీవల కాలంలో సినిమాల రీమేక్‌ల కంటే ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకే భాషలో తెరకెక్కించిన చిత్రం.. మిగతా భాషల్లో కూడా డబ్ అయ్యి విడుదలవుతోంది. దీంతో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. కానీ ఆలియా భట్ మాత్రం తన చిత్రాన్ని ఒకే భాషలో తెరకెక్కించి మిగతా భాషల్లో వేరే నటులతో రీమేక్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఆలియా భట్ లీడ్ రోల్‌లో నటించిన 'డార్లింగ్స్' ఇటీవల నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. విడుదలయిన కాసేపటికే ఈ మూవీ హిట్ టాక్‌ను అందుకుంది. గృహహింస కథాంధంతో తెరకెక్కిన చిత్రం ఇది. జస్మీత్ రీన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆలియాతో పాటు విజయ్ వర్మ, షెఫాలీ షా, రోషన్ మాథ్యూ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంతో ఆలియా మొదటిసారి నిర్మాతగా మారింది.


డార్లింగ్స్ చిత్రం కథ ప్రతీ భాషా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను తెలుగు, తమిళంలో కూడా రీమేక్ చేయాలని నిర్మాతలు ముందే నిర్ణయించుకున్నారట. తెలుగు, తమిళ ప్రేక్షకులకు తగినట్టుగా మార్పులు ఉంటాయి కానీ కథ ఏ మాత్రం మారదని మేకర్స్ వెల్లడించారు. ఇక డార్లింగ్స్‌కు తెలుగులో క్యాస్టింగ్ ఎవరైతే బాగుంటుందని ప్రేక్షకులు అప్పుడే అంచనా వేయడం మొదలుపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story