Abhishek Bachchan : తినడానికి కూడా నాన్న అప్పులు చేసేవారు- అభిషేక్ బచ్చన్ ఎమోషనల్..!
బాలీవుడ్ స్టార్ హీరోలలో అభిషేక్ బచ్చన్ ఒకరు.. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'బాబ్ బిస్వాస్' విడుదలకి సిద్దంగా ఉంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన అభిషేక్... 90వ దశకంలో తన కుటుంబం ఎదురుకున్న ఆర్ధిక పరిస్థితులను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం కోసం బోస్టన్ యూనివర్సిటీలో చేరిన సమయంలో తన తండ్రి అమితాబ్ బచ్చన్ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని భాగోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా ఓ పక్కా నష్టపోగా, మరోపక్కా సినిమా ఆఫర్లు లేకా అల్లాడిపోయారని అభిషేక్ గుర్తుచేసుకున్నారు.
ఈ క్రమంలో తినడానికి ఆయన అప్పులు చేశారని తెలిపాడు. తనను ఇంట్లో సమస్యలు కలవరపెట్టడంతో యాక్టింగ్ కోర్స్ మధ్యలోనే వదిలేసి ఇంటికి వచ్చానని తెలిపాడు. అలాంటి క్లిష్టమైన సమయంలో తన తండ్రికి, కుటుంబానికి దగ్గరగా ఉండి నైతిక స్థైర్యాన్ని అందించడం తన బాధ్యతగా అనిపిందని చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ లో 2000 సంవత్సరంలో వచ్చిన రెఫ్యూజీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్.
ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయినప్పటికీ.. తన నటనకి మంచి మార్కులు పడ్డాయి. 2004లో వచ్చిన ధూమ్ సినిమాతో హిట్ కొట్టి బాలీవుడ్‌లో హీరోగా తనదైన ముద్ర వేశాడు అభిషేక్. 2007లో నటి ఐశ్వర్యారాయ్‌ని వివాహం చేసుకున్నారు అభిషేక్. 2011 నవంబరు 16న వారికి ఆరాధ్య జన్మించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com