మీ ప్రేమ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది: బిగ్‌ బీ

మీ ప్రేమ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది: బిగ్‌ బీ
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్,జయ దంపతులు 50వ వివాహ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టారు

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్,జయ దంపతులు 50వ వివాహ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టారు. జూన్ 3, 1973న తన సహనటి జయ భాదురిని వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. దీంతో జూన్‌,3న వారి పెళ్లి రోజు కావడంతో బిగ్‌బీ అభిమానులు వారి జంటకు భారీగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారికి శుభాకాక్షలు తెలిపిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు అమితాబ్‌ కృతజ్ఞతలు తెలిపారు. నేడు( ఆదివారం) అమితాబ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ..".. ఈ 80 ఏళ్ల వృద్ధుడి 50వ వివాహ వార్షికోత్సవానికి నాకు, జయకి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా ప్రగాఢ కృతజ్ఞతలు .. మీ ప్రేమ, శ్రద్ధ మాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చాయి .." అని పోస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story