Anupam Kher: 'బాలీవుడ్.. స్టార్లను అమ్ముతుంది, ప్రేక్షకులను చిన్నచూపు చూస్తుంది'

Anupam Kher: సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్.. కొంతకాలంగా సినిమాల్లో అంత యాక్టివ్‌గా కనిపించలేదు. కానీ 'కశ్మీర్ ఫైల్స్' సినిమా మరోసారి ఆయనలోని నటుడిని ప్రేక్షకులకు గుర్తుచేసింది. దీంతో కేవలం హిందీలోనే కాదు సౌత్‌లో కూడా అనుపమ్‌కు అవకాశాలు రావడం మొదలయ్యింది. బాలీవుడ్‌లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఇన్నాళ్ల తర్వాత సౌత్‌లో తనకు అవకాశాలు వస్తున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్‌కు, సౌత్ సినీ పరిశ్రమలకు ఉన్న తేడాను మొహమాటం లేకుండా వివరించారు అనుపమ్.
ఈ ఏడాది అనుపమ్ ఖేర్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. కశ్మీర్ ఫైల్స్‌తో హిట్ కొట్టిన ఆయన మొదటిసారి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. 'కార్తికేయ 2'లో అనుపమ్ చేసిన పాత్ర ప్రేక్షకులపై భారీ ఇంపాక్ట్‌ను చూపించింది. కనిపించేది ఒక్క సీన్‌లోనే అయినా.. ఆయన క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయింది. తాజాగా అనుపమ్ ఓ ఇంటర్వూలో పాల్గొంటూ అసలు బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఆదరణ పొందడం లేదో బయటపెట్టారు.
'మేం ఒక గొప్ప సినిమా చేయడం వల్ల మీరు లాభం పొందుతున్నారని, మీరు ఒక గొప్ప సినిమా చూస్తారు అని బాలీవుడ్ అనుకుంటుంది. అంటే దానివల్ల ప్రేక్షకులను చిన్నచూపు చూసినట్టు అవుతుంది. సౌత్ వారు కథను నమ్ముతారు. కానీ బాలీవుడ్‌లో స్టార్లను అమ్ముకుంటాం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనుపమ్ ఖేర్. మరి ఈ కామెంట్స్‌పై బాలీవుడ్ బడా బాబులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com