Anurag Kashyap: ఓపెన్ గా అడిగేసింది... ఆఫర్ పట్టేసింది
అనురాగ్ కశ్యప్ ను ఓపెన్ గా ఆఫర్ అడిగేసిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ ప్రోగ్రామ్ తో పేరుగాంచిన దివ్యా అగర్వాల్ లవ్, బ్రేక్ అప్ అంటూ ఇప్పటివరకూ మీడియా లైమ్ లైట్ లో గడిపేస్తూనే ఉంది. అయితే ఆమెలోని నటిని వెలికితీంతేందుకు అమ్మడికి ఒక్క అవకాశమూ రాలేదు. ఇలా కూర్చుంటే కుదరదని ఫిక్స్ అయిందో ఏమో... ఏకంగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ ఓపెన్ లెటర్ రాసేసింది. గురువుగారు తమరు మరచిపోయారో ఏమో...నాకు నటిగా ఆఫర్ ఇస్తాను అన్నారు అంటూ ఓపెన్ గానే అందులో అడిగేసింది. దీనిపై స్పందించిన అనురాగ్ కశ్యప్ ఆమె లెటర్ ను చూసి ఫిదా అయిపోయాడట. తన సినిమాకు తదుపరి ఆడిషన్స్ జరిగినప్పుడు ఆమెను తప్పకుండా పిలుస్తానంటూ హామీ ఇచ్చాడు. ఇదే విషయాన్ని దివ్యా అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని మురిసిపోయింది. ఏమైనా అడగందే అమ్మైనా పెట్టదు అన్న నానుడిని నిజం చేస్తూ దివ్యా అడిగి మరీ సాధించుకుంది.