డేటింగ్ యాప్‌లో పరిచయమై పెళ్లి పట్టాలెక్కిన ఆలియా -షేన్ జంట

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. తన స్నేహితుడు షేన్‌ను ఆమె వివాహం చేసుకోనుంది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇండోనేషియాలోని బాలి వేదికగా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇన్‌స్టా వేదికగా ఆలియా ఈ విషయాన్ని తెలిపింది. తన బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్, సోల్‌మేట్ ఇప్పుడు తనకు కాబోయే భర్త అయ్యాడని ఆమె వెల్లడించింది.
ఆలియా - షేన్ ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యుల అంగీకారంతో తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక, అనురాగ్ కశ్యప్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలకు ఆయన దర్శకుడిగానే కాకుండా నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా వ్యవహరించారు. బాంబే టాకీస్, బాంబే వెల్వెట్, లస్ట్ స్టోరీస్, ఘోస్ట్ స్టోరీస్, దోబారా వంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన కెన్నెడీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com