అత్యాచార ఆరోపణలు..పోలీస్ స్టేషన్‌కు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్.. గురువారం ముంబైలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు హాజరైన అనురాగ్... విచారణను ఎదుర్కోబోతున్నారు. అనురాగ్ కశ్యప్ తనతొ అనుచితంగా ప్రవర్తించాడని.. నటి పాయల్ ఘోష్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని ఈ మధ్యే కలిసి పాయల్ ఘోష్ తనకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు ఓ లేఖ కూడా అందజేశారు. లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో.. నిన్న ముంబై పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు.
పాయల్ ఘోష్ ఆరోపణలను.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తీవ్రంగా ఖండించారు. తాను అలాంటివాడిని కాదన్నారు. తనపై కావాలనే పాయల్ ఆరోపణలు చేస్తున్నారని అనురాగ్ తెలిపారు. పాయల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో... అనురాగ్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖల నుంచి మద్దతు లభించింది. సెన్సేషన్ డైరెక్టర్ వర్మ కూడా.. అనురాగ్‌కు మద్దతుగా నిలిచారు. అటు రాజకీయ ప్రముఖులు కూడా.. అనురాగ్‌ను సపోర్ట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com