బాలీవుడ్

Anushka Sharma: అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంటా..? బాలీవుడ్‌లో వైరల్ అవుతున్న రూమర్స్..

Anushka Sharma: ఇటీవల అనుష్క, విరాట్.. ముంబాయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట కనిపించారు.

Anushka Sharma: అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంటా..? బాలీవుడ్‌లో వైరల్ అవుతున్న రూమర్స్..
X

Anushka Sharma: బాలీవుడ్‌లోని సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిలతో ట్రెండ్ సృష్టిస్తున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయం నుండి ఇప్పటివరకు ఎంతోమంది బాలీవుడ్ నటీనటులు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చూసుకొని సెటిల్ అయిపోయారు. ఇలా ఎన్నో గుడ్ న్యూస్ వింటున్న బాలీవుడ్ ప్రేక్షకులకు అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లీ, అనుష్క.. ఓ హాస్పిటల్ బయట కనిపించడమే దీనికి కారణం.


బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అనుష్క.. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ వామికా అనే కూతురు కూడా ఉంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన అనుష్క.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయిదే ఇదే సమయంలో తను ప్రెగ్నెంట్ అన్న వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల అనుష్క, విరాట్.. ముంబాయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట కనిపించారు. దీంతో అనుష్క మళ్లీ ప్రెగ్నెంట్ అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ అసలు విషయం అది కాదట. అనుష్క ప్రస్తుతం 'చక్దా ఎక్స్‌ప్రెస్' అనే సినిమా చేస్తోంది. ఇది ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌లో ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఇందులో క్రికెటర్‌గా కనిపించడానికి అనుష్క చాలా ప్రాక్టీస్ చేసిందట. దీని వల్ల తను చాలా అలసిపోవడంతో ఓసారి చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లిందట.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES