Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌కి ఎన్‌సీబీ క్లీన్‌చిట్..
![Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌కి ఎన్‌సీబీ క్లీన్‌చిట్.. Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌కి ఎన్‌సీబీ క్లీన్‌చిట్..](https://www.tv5news.in/h-upload/2022/05/27/721682-aryan.webp)
Aryan Khan: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆర్యన్‌ఖాన్‌తో సహా ఆరుగురికి నిర్దోషులుగా తేల్చింది. ఆర్యన్ సహా కొందరి విషయంలో నేరం నిరూపించేందుకు పూర్తి ఆధారాల్లేవని పేర్కొంది. అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచ సహా 14 మందిపై 6 వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
డ్రగ్స్ కేసుపై స్పెషల్ కోర్టులో ఇవాళ తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్సీబీ.. ఆర్యన్, మెహక్ వద్ద తప్ప పార్టీలో అందరి వద్ద డ్రగ్స్ దొరికాయని తెలిపింది. గతేడాది అక్టోబర్ 2వ తేదీన కార్డిలా క్రూయిజ్ షిప్‌లో ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ కాగా.. 25 రోజులు జైల్లోనే ఉన్నారు. విచారణ సమయంలో కొన్ని తప్పులు, అవకతవకలు జరిగాయని ఎన్సీబీ పేర్కొంది.
ఇప్పుడు 14 మందిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని తెలిపింది. గతేడాది ముంబై తీరంలో బయటపడ్డ భారీ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా 8 మందిపై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది.
ఎన్సీబీ వాదనలో ఏకీభవించిన కోర్టు ఆర్యన్‌ను కస్టడీకి ఇచ్చింది. అయితే కేసు విచారిస్తున్న NCB అధికారి సమీర్ వాంఖడేపై వేటు పడింది. వాంఖెడేను తొలగించి సెంట్రల్ జోన్‌కు కేసును బదిలీ చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో వాంఖడేను తప్పిస్తున్నట్లు అప్పట్లో ఎన్‌సీబీ పేర్కొంది. ఆర్యన్‌ఖాన్ కేసు సహా మొత్తం ఆరు కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్ సింగ్ నేతృత్వంలోని సిట్ బృందం విచారించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com