Aryan Khan: సోషల్ మీడియాకు రీ ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ కుమారుడు.. క్యూట్ పోస్ట్‌తో..

Aryan Khan: ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. ఎంతోమంది బడా హీరో, హీరోయిన్ల పేర్లు ఈ కేసులో బయటికొచ్చాయి. అయితే అంతా సర్దుకుంది అనుకునేలోపే ఓ క్రూజ్‌లో పోలీసులు డ్రగ్స్‌ను పట్టుకోవడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ క్రూజ్‌లోనే షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండడం అందరూ మాట్లాడుకునే అంశంగా మారింది. వీటన్నింటి వల్ల ఆర్యన్ ఖాన్ ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.
పోలీసులకు డ్రగ్స్ దొరికిన క్రూజ్‌లోనే ఆర్యన్ ఖాన్ పార్టీ చేసుకుంటూ ఉండడంతో తనను కూడా నిందితుడిగా భావించి అదుపులో తీసుకున్నారు. తనను బయటికి తీసుకురావడానికి షారుఖ్ పలు ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా పలుమార్లు బెయిల్ పిటీషన్ రిజెక్ట్ అయ్యింది. చివరిగా జులై 15న న్యాయస్థానం.. ఆర్యన్ ఖాన్‌కు నిర్దోషి అని తేల్చి విడుదల చేసింది.
ఆర్యన్ ఖాన్ జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత పెద్దగా బయటికి రావడం లేదు. కొన్నాళ్ల క్రితం మరోసారి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దాదాపు సంవత్సరం నుండి ఆర్యన్ యాక్టివ్‌గా లేడు. అయితే తాజాగా తన ఫ్యామిలీ ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్ ఖాన్. తన సోదరి సుహానా ఖాన్, తమ్ముడు అబ్‌రమ్ ఖాన్‌తో దిగిన ఫోటోను షేర్ చేసి 'హ్యాట్రిక్' అని క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com