Aryan Khan: ఆర్యన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం.. యాక్టింగ్‌ను కాదంటూ..

Aryan Khan (tv5news.in)
Aryan Khan: సినీ పరిశ్రమలో వారసత్వంపై చాలానే నెగిటివిటీ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ వారసత్వ చిచ్చు ఎప్పటినుండో రగులుతూనే ఉంది. బాలీవుడ్ వారసత్వంగా వచ్చిన నటులు.. టాలెంట్‌తో నటీనటులు కావాలనుకునేవారిని ఎదగకుండా చేస్తున్నారని కొందరు పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మరో వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాడు. కానీ హీరోగా కాదని బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.
బాలీవుడ్‌లో కింగ్ ఖాన్‌గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్. ఓ సాధారణ టీవీ హోస్ట్ స్థాయి నుండి ప్రపంచంలోనే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నాళ్లుగా షారుఖ్ ఖాన్ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించకపోయినా.. తన క్రేజ్ మాత్రం బీ టౌన్‌లో ఏ మాత్రం తగ్గలేదు. ఇక కెరీర్ పరంగా కాస్త స్లో అయిన షారుఖ్‌కు తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇక ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం డ్రగ్స్ కేసు నుండి పూర్తిగా బయటపడ్డాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ కోలకత్తా నైట్ రైడర్స్ టీమ్ తరపున పాల్గొన్నాడు. తాజాగా ఆర్యన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి వరుసగా కథనాలు వినిపిస్తున్నాడు. త్వరలోనే ఆర్యన్ ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడట. కాకపోతే హీరోగా కాదని టాక్.
ప్రస్తుతం సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. వెబ్ సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ ఉంది. అందుకే స్టార్ నటీనటులు సైతం వెబ్ సిరీస్‌లలో నటించాలని ఆశపడుతున్నారు. అయితే వెబ్ సిరీస్‌తోనే ఆర్యన్ కూడా తన కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడట. కాకపోతే యాక్టర్‌గా కాకుండా రైటర్‌గా డెబ్యూ ఇవ్వనున్నాడట ఆర్యన్. అమెజాన్ ప్రైమ్‌లో ఆర్యన్ ఒక వెబ్ సిరీస్‌కు రైటర్‌గా చేస్తున్నాడని, ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టేశాడని బీ టౌన్‌లో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com